16-08-2024 12:43:44 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఈ నెల 17న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో డ్రగ్స్ అబ్యూస్, యాంటి ర్యాగింగ్ అంశంపై మాసాబ్ ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్టు సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు డీజీపీ జితేందర్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాం కేతిక విద్య కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో డ్రగ్స్, ర్యాగిం గ్ నివారణపై మాట్లాడనున్నారు.