calender_icon.png 19 November, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోదరభావంతో కలిసిమెలసి ఉండాలి

16-08-2024 12:42:05 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని ఉన్నత విద్యామండలిలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వతంత్ర భారతంలో అందరూ కలిసి మెలసి ఉండాలని పిలుపునిచ్చారు.  ఉన్నత విద్యారంగ అభివృద్ధిలో తెలంగాణ ఉన్నత విద్యామండలి క్రియాశీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.