calender_icon.png 15 August, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులకు అభినందన

15-08-2025 01:43:44 AM

ఇల్లెందు, ఆగస్టు 14, (విజయ క్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో  నిర్వ హించే 79వ స్వా తంత్ర దినోత ్సవాన్ని పురస్కరిం చుకొని వివిధ గనులు, విభా గాలలో పనిచే స్తున్న ఉద్యోగు లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఎంపిక కాబడి నటువంటి ఉత్తమ ఉద్యోగులను ఏరియా జనరల్ మేనేజర్  వి.కృష్ణయ్య ఆయన  కార్యా లయంలో గురు వారం అభినం దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విధులలో వీరు కనబరిచిన క్రమశిక్షణ  కష్టం  శ్రమను గమనించిన సింగరేణి సంస్థ మిమ్మల్ని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేయబడిం దని ఇదే స్ఫూర్తితో పని చేయాలని తోటి ఉద్యోగులకు కూడా మీరు స్ఫూర్తిదాయ కంగా ఉండాలని  మీరు ఉత్తమ ఉద్యోగు లుగా ఎంపిక కావడంలో మీ కుటుంబ సభ్యుల సహాయ సహ కారాలు ఉన్నాయని తెలిపారు.

ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులు ఫిట్టర్, కె.ఒ.సి-2, ఉత్తమ (ఎన్.సి.డబ్ల్యు.ఎ) ఉద్యోగి  బండి సీతారాములు, ఈయనకు  కొత్తగూడెంలో సి&యం.డి ఎన్. బలరాం  చేతుల మీదుగా సన్మానము చేస్తారని తెలిపారు. ఈ.పి. ఆపరేటర్, జె.కె.5 ఓసి,(ఉత్తమ ఉద్యోగి) దారావత్ గోపి సింగ్,  ఈ.పి. ఆపరేటర్, జె.కె.5 ఓసి,(ఉత్తమ ఉద్యోగి) అరికల లక్ష్మన్ రావు, ఎలక్ట్రీషియన్, కె.ఓ.సి-2 (ఉత్తమ ఉద్యోగి) గుగులోత్ బసు, హెడ్ ఓవర్మన్, కె.ఓ.సి-2 (ఉత్తమ ఉద్యోగి) తుమ్మ రాజేశ్వర్ రావు, జనరల్ మజ్దూర్, సి.హెచ్.పి.(ఉత్తమ ఉద్యోగి) రామచంద్రపురపు హేమంత్ కుమార్ ఉత్తమ ఉద్యోగులను ఇల్లందు ఏరియా సి.ఇ.ఆర్. క్లబ్ జె.కె. కాలనీ నందు ఉదయం 09.30 గంటలకు జరిగే వేడుకలలో జి.యం వి.కృష్ణయ్య చేతుల మీదుగా సన్మానం చేస్తారని యాజమాన్యం ప్రకటించింది. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో హాజరు కాగలరని తెలిపారు.