calender_icon.png 15 August, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ‘పరిమ్యాచ్’ కేసులో ఈడీ సోదాలు

15-08-2025 01:44:46 AM

  1. దేశవ్యాప్తంగా 17 చోట్ల దాడులు 110 కోట్లను ఫ్రీజ్ చేసిన ఈడీ అధికారులు
  2. 1200 క్రెడిట్ కార్డులు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయ క్రాంతి): ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ‘పరిమ్యాచ్’ కేసులో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 17 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, సూరత్, జైపూర్, నోయిడా, మధురై, కాన్పూర్‌లలోనూ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఈడీ అధికారులు పలు బ్యాంక్ ఖాతాల్లోని రూ.110 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు. 1200 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

డిజిటల్ డాక్యుమెంట్లు, మ్యూల్ ఖాతాల డెబిట్, క్రెడిట్ కార్డులు, డిజిటల్ పరికరాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 2024లో ముంబై సైబర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ‘పరిమ్యాచ్ డాట్‌కామ్’పై నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులు.. పెట్టుబడి పెట్టిన వారి నుంచి ఏడాదిలో రూ.3 వేల కోట్లు కాజేసినట్టు ఈడీ పేర్కొంది.

మ్యూల్ ఖాతాల్లో నగదు ఉంచి తమిళనాడు మధురైలలో భారీగా నగదు విత్‌డ్రా చేసినట్టు గుర్తించింది. హవాలా రూపంలో డబ్బును యునైటెడ్ కింగ్‌డమ్‌కు పంపి అక్కడ క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు.  ప్రధానంగా సామాన్యుల పేరుతో తెరిచిన ‘మ్యూల్ ఖాతాల’ ద్వారా నిధులను దారి మళ్లించారు. ఆ తర్వాత ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ వాలెట్లలోకి పంపి, తమిళనా డులోని పలు ప్రాంతా ల్లో ఏటీఎంల ద్వారా నగదుగా విత్‌డ్రా చేశా రు.

అంతేకాకుండా, అనుమానం రాకుండా ఉండేందుకు చిన్న చిన్న మొత్తాల్లో యూపీఐ ద్వారా కూడా బదిలీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసు విచారణలో భాగంగా, గతంలో ఈ యాప్‌ను ప్రమోట్ చేసిన టాలీవు డ్ ప్రముఖులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి వారిని కూడా ఈడీ ప్రశ్నించింది.