calender_icon.png 25 August, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్యసేవలు చేరవేయడమే కాంగ్రెస్ లక్ష్యం

25-08-2025 12:32:38 AM

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల ఆగస్టు 24 (విజయ క్రాంతి) : ప్రతి గ్రామంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి అన్నారు.పరకాల మండలం మల్లక్క పేట గ్రామంలో  టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య  ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  పాల్గొని ప్రసంగించారు. అంతకముందు మల్లక్కపేట ఆర్చ్ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. వైద్య సిబ్బందిని శాలువాతో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని,ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం సమాజానికి మేలు చేస్తుందన్నారు.

పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహించిన దొమ్మాటి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, రోగులకు అవసరమైన మందులు, పరీక్షలు, వైద్య సలహాలు సమగ్రంగా అందించాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో వివిధ విభాగాల నిపుణ వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.మల్లక్కపేట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.