06-08-2025 12:36:57 AM
మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు
సిద్దిపేట, ఆగస్టు 5(విజయక్రాంతి): బహుజనుల వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీ లే కారణమని, బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన బిఎస్పి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మహాపురుషుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
అనంతరం అసెంబ్లీ వారీగా రివ్యూ నిర్వహించారు. బీఎస్పీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి, కమిటీలలో యువత, బీసీలకు 50% అవకాశాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తోందని, బీఎస్పీ ద్వారానే రాజ్యాంగం రక్షణ సాధ్యమన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారం సాధించకపోతే శాశ్వత బానిసలుగా మారిపోతారని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, అసెంబ్లీ కమిటీ, సెక్టార్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.