calender_icon.png 15 August, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు వినతి

15-08-2025 12:18:22 AM

అలంపూర్, ఆగస్టు, 14: అలంపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడిని కళాశాల అధ్యాపకులు కోరారు.ఈ మేరకు గురువారం కర్నూల్ పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

కళాశాలలో ఆవరణలో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విన్నవించారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాకు  కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పలు సమస్యలను  సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాపక బృందం పాల్గొన్నారు