calender_icon.png 15 August, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కానున్న ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి

15-08-2025 12:16:41 AM

వనపర్తి టౌన్, ఆగస్టు 14 : వనపర్తి జిల్లా ఐడిఓసి ఆవరణలో ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ  వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సి పట్నం మహేందర్ రెడ్డి హాజరుకానున్నారు.  ఉదయం 9:30 గంటలకు ముఖ్యఅతిథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు.

ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం 

వనపర్తి, ఆగస్టు 14 ( విజయక్రాంతి ) : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు.  ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని అనంతరం ముఖ్య అతిథి జిల్లా  ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు.  సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.   

వనపర్తి జిల్లా ఐ.డి.ఒ.సి ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వర్షం వచ్చినా  వేడుకలకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎ. ఓ భాను ప్రకాశ్ ను ఆదేశించారు. విద్యార్థులు, అధికారులు, ప్రజలు వేడుకలను వీక్షించడానికి అనువైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టాల్స్ ఏర్పాట్లను సైతం పరిశీలించారు.