calender_icon.png 15 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

14-08-2025 10:30:42 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండల(Jagdevpur Mandal) కేంద్రంలో అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారుజామున రాచకొండ యాదమ్మ(75) అనే వృద్ధురాలు మృతిచెందింది. విషయం తెలుసుకున్న జగదేవపూర్ మండల రజక సంఘం నాయకులు గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుంచి జగదేవపూర్ మండల రజక సంఘం రజకుల సమస్యలు పరిష్కరిస్తూ మరోవైపు ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ క్రమంలో జగదేవపూర్ మండల రజక సంఘం నాయకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో రాచకొండ యాదగిరి, రాచకొండ సీతయ్య, ఆకారం నర్సింలు, రాచకొండ శీను, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.