09-10-2025 12:00:00 AM
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
చిన్నచింత కుంట,అక్టోబర్ 8: అమలకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా మోసం చేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు అంటూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు లో చెప్పినవే బాకీ కార్డు రూపంలో ప్రజలకు అందిస్తున్నామన్నారు.
గ్యారెంటీ కార్డు, బాకీ కార్డు పరిశీలిస్తే ప్రజలకు క్లారిటీ వస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.