calender_icon.png 21 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయమాటలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్

21-07-2025 12:35:09 AM

- స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెపుతారు

- మాజీ ఎమ్మెల్యే మెచ్చా ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి భారీ చేరికలు 

అశ్వారావుపేట, జూలై 20 (విజయ క్రాంతి) :మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చే సిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అశ్వారావుపేట నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.

ఆదివారం అశ్వారావుపేట మండలం, నా రంవారిగూడెం కాలనిలో సుమారు 40 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. కుప్పాల కృష్ణ, సంగ రాంబాబు, ఎదిరాజు రాంపండు, దానం రాటాలు,ముప్పిడి కృష్ణ వేణి, నిర జమ్మ తదితర కుటుంబాలవారికీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా పా ర్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 18 నెలలు కావస్తున్న , మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని. తులం బంగారం ఊసే లేదని, కె. సి ఆర్ కిట్, న్యూట్రీషియన్ కీట్లను శాశ్వతంగా ఆపేసి ఎంతో మందికి అన్యాయం చేశారన్నారు.

కె సి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపు డు తాను వెళ్ళి ఏది అడిగినా వెంటనే మంజూరు చేశారని అం దులో భాగంగానే అశ్వారావుపేటలో 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, ఆర్ టి ఓ కార్యాలయం,డిగ్రీ కళాశాల, సెంట్రల్ లైటింగ్, దమ్మపేటలో కోర్టు, సెంట్రల్ లైటింగ్, 10 పడకల ఆసుపత్రి భవనం, ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్, పి హెచ్ సి భవనం,అనేక బ్రిడ్జిలు, అన్నపురెడ్డిపల్లిలో సెంట్రల్ లైటింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

అధికారంలోకి వచ్చి 18నెలలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు ఒక్కటైనా చెప్పాలని డి మాండ్ చేశారు. ఇటీవలే అశ్వారావుపేట వచ్చిన మంత్రి సెంట్రల్ లైటింగ్ పనులు వారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు..దుమ్ము ధూళి తో అశ్వారావుపేట ప్రజలు నరకం చూస్తున్నారని, కాంగ్రెస్‌ని ఎందుకు గెలిపించాంరా అని తలలు పట్టుకుంటున్నారన్నా రు.. గత పది ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని త ప్పుడు ప్రచారాలు చేస్తున్నారని 2021 లో కూడా నూతన రేష న్ కార్డులను బి ఆర్ ఎస్ పార్టీ ఇచ్చిందని అన్నారు .

యువకు ల నుంచి వృద్ధుల వరకు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్య తిరేకంగా ఉన్నారని వారందరూ కూడా మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని ఎదురు చూస్తున్నారని. అందులో భాగంగా నే నేడు 40కుటుంబాలు బి ఆర్ ఎస్. పార్టీలో చేరారని. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా చాలా మం ది వస్తారని. త్వరలో అన్ని గ్రామాల్లో పర్యటనలు...సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బి ఆర్ ఎ స్పార్టీ అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు,మాజీ ఏం పి పి జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు,మోహన్ రెడ్డి,వైస్ ఏం పి పి ఫణీంద్ర,కాసాని చంద్రమోహన్, సత్యవరపు సంపూర్ణ,జె శ్రీరామ్ మూర్తి,మాజీ సర్పంచ్ లు నారం రాజ్ శేఖర్,నారం రాధ,మోటూరి మోహన్ తదితరులు ఉన్నారు.