19-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డా.సీహెచ్ ప్రీతీరెడ్డి, కార్పొరేటర్ సరళ హాజరు
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాం తి): ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు కార్తీక మహోత్సవం మూడు రోజులపాటు హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ఎంసీహెచ్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. హోమాలు, వ్రతాలు, అభిషేకాలు, పారాయణాలు.. ఒకేచోట జరిపించ డం ఎంతో ఆనందంగా ఉందని హైబిజ్ వన్ ఫౌండర్ అండ్ ఎండీ, నిర్వాహకులు డాక్టర్ జె సంధ్యారాణి తెలిపారు. మొదటి రోజు మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రెండవ రోజు రుద్రాభిషేకం, రుద్ర హోమం.. కీసరగుట్ట దేవస్థానం వారి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణంతో మొదలైంది. సాయం త్రం అడికె కార్తీక్ స్వామి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ గురుస్వామి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పడిపూజకు హాజరయ్యారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన సంధ్యా రాణిని అభినందించారు.
ముగింపు రోజు అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక కార్పొరేటర్ కేతినేని సరళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని దైవాశీస్సులు పొందారు.