27-01-2026 12:31:10 AM
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): తెలంగాణను గతంలో పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ అన్ని వర్గాలకు తీవ్ర అన్యా యం చేసిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు అన్యాయం, ద్రోహం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాల యంలో సోమవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతుబంధు లేదు, విద్యార్థు లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. ఒకప్పుడు దేశాన్ని విడగొడతామని చెప్పిన జమాతే ఇస్లామీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని, “ముస్లిం ఈజ్ కాంగ్రె స్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అంటూ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలోరాజ్యాంగానికి అవమానం
కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని అవహేళన చేశారని, నాటి నెహ్రూ నుంచి నేటి రా హుల్ గాంధీ వరకూ ఏదోక సందర్భంలో అవమానించారని ఎన్.రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీ అని చెప్పే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మెదడు చోరీ అయ్యిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ--జీ రామ్ జీ చట్టం--2025 కేవలం మరో చట్టం కాదని, అది గ్రామ స్వరాజ్యానికి నిజమైన బలాన్ని ఇచ్చే చారిత్రాత్మక సంస్కరణ అని తెలిపారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డా.కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కాసం వెంకటేశ్వర్లు, డా. బూర నర్సయ్య గౌడ్, బండ కార్తీక రెడ్డి, సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతల రా మచంద్ర రెడ్డి, అధికార ప్రతినిధి, మీడి యా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.