27-01-2026 12:32:07 AM
పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
నారాయణఖేడ్, జనవరి 26: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సమావేశాన్ని సోమవారం స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ సెట్‌కార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో మున్సిపల్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రత్యేక రింగ్ రోడ్డు ఏర్పాటు, ఆయా కాలనీలో నాణ్యమైన నాణ్యమైన నిర్మాణం, స్థానిక కుడల్లను సుందరీకరణ వంటి అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో గెలుపును కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నగేష్ కుమార్ షట్కార్, శంకరయ్య స్వామి, సుధాకర్ రెడ్డి, కర్నే శ్రీనివాస్, తాహెర్ అలీ, రషీద్, సాగర్ షట్కార్, శంక ర్సేట్, పండరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.