calender_icon.png 29 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

29-12-2025 12:28:22 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ ఘట్ కేసర్ పట్టణం, 7వ డివిజన్ ఎదులాబాద్ పరిధిలోని ఎదులాబాద్, అవుషాపూర్, అంకుశాపూర్, ఘనపురం లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్  గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. 

ఈ వేడుకల్లో మామిండ్ల ముత్యాల్ యాదవ్, కర్రె రాజేష్, మాజీ సర్పంచ్ లు వేముల మమత గౌడ్, ననావత్ రూప్ సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, మేడబోయిన వెంకటేష్, మాజీ ఎంపీటీసీలు కందుల కుమార్, గట్టగల్ల రవి, జిల్లా యూత్  కాంగ్రెస్ మాజీ కార్యదర్శి కవాడి మాదవరెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, రైతు సొసైటీ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడుపోల్ల మల్లేష్, కీసరగుట్ట దేవస్థానం ధర్మకర్తలు సగ్గు అనీత,

సామల అమర్, మాజీ ఉపసర్పంచ్లు వేముల సత్తయ్యగౌడ్, వేముల పరమేష్ గౌడ్, గ్రామ కమిటి అధ్యక్షులు వేముల రాజు గౌడ్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాధ్, వేముల గోవర్డన్, గుర్జకుంట నర్సింహా, మెట్టు నర్సింహా, వేముల శంకర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్ వామన్ రెడ్డి, సందీప్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఖయ్యం, ఫారూక్, రహమాన్, బొక్క సంజీవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ 

చేవెళ్ల, డిసెంబర్ 28(విజయక్రాంతి): పేదల అభ్యున్నతి కోసం  నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు  శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల మండల  అధ్యక్షులు వీరేందర్ రెడ్డి అన్నారు.  ఆదివారం చేవెళ్ల మండలకేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భావం దినోత్సవం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... దేశ సేవలో 141 ఏళ్లు పూర్తిచేసుకుని కాంగ్రెస్ పార్టీ.. అదే స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది  అని 141ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,  పేదల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఎంతో మందిని నాయకులను చేసి ఉన్నత స్థానాల్లో నిలబెట్టిందన్నారు.

దేశ అభివృద్ధి, ప్రజాసంక్షేమంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ పార్టీ  బలోపేతానికి కార్యకర్తలంతా ఐక్యమత్యంగా పని చేయాలన్నారు.రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం,ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం నవా పేట్ సర్పంచుల సంఘం అధ్యక్షులు దాదాపూర్ సర్పంచ్ బల్వంత్ రెడ్డిగారిని,నాగి రెడ్డిపల్లి సర్పంచ్ శేఖర్, మీనపల్లి కాలన్ సర్పంచ్ రమేష్, మాదిరెడ్డిపల్లి సర్పంచ్ గోపాల్ తదితర  గ్రామాల  సర్పంచులను శాలువతో సన్మానించి అభినందించారు.

కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు, డిసిసి ఉపాధ్యక్షులు పడాల రాములు, పల్గుట్ట మాజీ సర్పంచ్ నర్సిములు, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ గంగి యాదయ్య, చేవెళ్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్దన్ నాయకులు  శేఖర్ రెడ్డి, B మల్లారెడ్డి, ప్రభాకర్,ఉరెళ్ల యాద య్య, మైనార్టీ నాయకులు చాన్ పాషా, లియా కత్,బురాన్ సురేష్ రాజు, సాయి పాల్గొన్నారు.

జవహర్‌నగర్ చౌరస్తాలో 

జవహర్ నగర్, డిసెంబర్ 28,(విజయక్రాంతి): పేదల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే సాధ్యమౌతుందని, 141 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని సస్యశ్యామలం చేసిందని కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141ఏళ్ళ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జవహర్ నగర్ ప్రధాన చౌరస్తాలోని కాంగ్రెస్పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్యాదవ్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ తీసుకువచ్చి పరిపాలనను సులభతరం చేయడంతో కాంగ్రెస్పార్టీ కృషి మరుమలేనిదని, పేదలకు పక్కా ఇళ్ళు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు అందజేస్తుందని, ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణ ప్రగతి చెందుతుందని అన్నారు. గ్రామాల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్పార్టీ గెలుపొంది ప్రజల ఆదరణను పొందిందని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతికోటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయికుమార్, లావణ్య సతీష్ గౌడ్, నాయకులు సదానంద్, నాయకం భాస్కర్, వినయ్కుమార్, వెంకటేశ్వర్లు, పద్మారావు, బూడిద వెంకటేష్, అశోక్, శ్రీనివాస్, మిట్టుయాదవ్, రాజుయాదవ్, కాలేషా, మంజుల తదితరులు పాల్గొన్నారు.