calender_icon.png 11 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచార జాతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

11-09-2025 01:26:41 AM

-సంచార జాతుల ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం 

-మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఖైరతాబాద్; సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : సంచార జాతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో సంచారయుక్త జాతుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు.

దీనిలో భాగంగా సంచార జాతు ల అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయించి ఇప్పటికే 100 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు.కుల వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలని అన్నారు. తాను వెనుక బడిన తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి మంత్రి స్థాయి వరకు ఎదిగారని తెలిపారు.

రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని తెలిపారు. సంచార జాతులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన చేయనన్నట్లు తెలిపారు. అలాగే సంచార జాతులకు ఇళ్ల నిర్మాణాలు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సంచార జాతులు ఉన్నదా చదువులను చది వి రాజకీయంగా నిలదుకోవాలని సూచించారు.

సంచార జాతుల విముక్తి దినోత్సవం భవిష్యత్ లో మరింత ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపాటి జైపాల్, మాజీ ఐఏఎస్ చిరంజీవి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.