11-09-2025 01:27:55 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో 2025 సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌లో బుధవారం బీబీఏ, బీసీఏ కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థుల కోసం రెండవ ఒరియంటేషన్ డే విజయవంతంగా నిర్వహించారు.
డాక్టర్ హెచ్‌ఎస్ సైనీ, వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిథిగా హాజరై.. విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించుకొని, విద్యను ప్రయోజనకరంగా మలచుకోవాలని సూచించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ తన సందేశం ద్వారా విద్యార్థులు, వారి తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు సమ య నిర్వహణతో విద్య ను సాగించాలని సూ చించారు.
కార్యక్రమంలో డా. విశాల్ వాలియా, రెజిస్ట్రార్, డా. సి. కలయరాసన్, రెక్టర్, ప్రొఫెసర్ సలారియా, డీన్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ (యూఐసీ ఎస్‌ఏ), డా. పి.పార్థసారధి, డైరెక్టర్ ప్లానింగ్, డా. రోజ్‌మేరీ, హెడ్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ (యూఐఏం సి), డాక్టర్ దేబశీష్ పాండా కంట్రోలర్ అఫ్ ఎగ్జామ్స్, డాక్టర్ మహేంద్రన్ బోట్లగుంట పాల్గొన్నారు.