26-12-2025 01:35:59 AM
లక్నో, డిసెంబర్ 25: కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఒకే కుటుంబాన్ని కీర్తిం చాయని, ఎంతోమంది జాతీయ నాయకుల ను విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నెహ్రూ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. దేశాభివృద్ధికి కృషి చేసిన నేతలను తమ పార్టీ గుర్తిస్తోందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం జాతీయ స్మారకాన్ని, ప్రాంగణాన్ని(రాష్ట్రీయ ప్రేరణా స్థల్)ను మోదీ ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ప్రతి దానికీ ఒక్క కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లను పెట్టేవారు. ఎందరో జాతీయ నాయకులను విస్మరించారు. ప్రతిపక్షాలతో సంబ ంధం ఉన్నవారిని అగౌర వపరిచారు. కానీ బీజేపీ ప్రభుత్వం వారికి సముచిత స్థానం కల్పిస్తోంది. భారత ఐక్యత కోసం కృషి చేసిన వారి సేవలను గుర్తిస్తోంది. వాజ్‌పేయి, మదన్‌మో హన్ మాలవీయ(ఈ రోజే జయంతి) దేశ ని ర్మాణంలో చెరగని ముద్ర వేశారు’ అని పేర్కొన్నారు.
తమ పార్టీ మాజీ రాష్ట్రపతి ప్ర ణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు అందరినీ గౌరవిస్తోం దని, వారికి తగిన గుర్తింపు ఇస్తోందని స్పష్టం చేశారు. ‘గత 11 సంవత్సరాలలో ప్ర పంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రంగా మారిందని తెలిస్తే.. ఇప్పుడు అటల్‌జీ ఎక్కడున్నా సంతోషిస్తా రు’ అని అన్నారు. ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొబైల్ తయారీలో ముందంజలో ఉందన్నారు.
రూ.230 కోట్లతో ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’
భారత రాజకీయాల్లో గొప్ప ఘనత సాధించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా గురువారం దేశానికి అద్భుతమైన గిఫ్ట్ లభించింది. యూ పీలోని లక్నోనగరంలో సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, రూ.230 కోట్ల వ్య యంతో నిర్మించిన ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్మారక చిహ్నంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. నింగిని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు.
దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి 65 అడుగుల విగ్రహాలు కొలువుదీరాయి. ఈ విగ్రహాలు భారత దేశ రాజకీయ విలువలకు, నిస్వార్థ ప్రజాసేవకు సజీ వ సాక్ష్యాలుగా నిలుస్తూ.. సందర్శకులలో దేశభక్తిని పెంపొందించనున్నాయి. సుమారు 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత కళాత్మకంగా కమలం ఆకారంలో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. ఇందులో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను ఉప యోగించారు. ఇది స్మారక చిహ్నంగానే కాకుండా గొప్ప విద్యాకేంద్రంగా నిర్మించారు.