05-05-2024 12:05:00 AM
అందుకే ఆమెను పోటీకి దూరంగా ఉంచారు: ప్రమోద్
ఘజియాబాద్, మే 4: కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకగాంధీకి వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ మాజీ నేత ప్రమోద్ కృష్ణన్ ఆరోపించారు. రాహుల్‌గాంధీని రాయ్‌బరేలీలో పోటీకి దింపటం అందులో భాగమేనని అన్నారు. ‘ప్రియాంకను రాహుల్‌గాంధీ ఎన్నికల్లో పోటీచేయని వ్వరని ముందే చెప్పా. ఆ కుటుంబంలో, పార్టీలో ప్రియాంకకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతున్నది’ అని ఆరోపించారు. రాహుల్‌కు అమేథీ నుంచి పోటీ చేయటం ఇష్టం లేకపోతే వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేయాల్సి ఉండెనని పేర్కొన్నారు. ‘రాహుల్‌గాంధీ అమేథీని వదిలిపెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింది. ప్రియాంకను ఎన్నికలకు దూరంగా ఉంచటంతో ఆమె అభిమానుల గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి. జూన్ 4 తర్వాత బద్దలవుతా యి. కాంగ్రెస్ మరోసారి రెండు గ్రూపులుగా చీలిపోవటం ఖాయం. ఒకటి రాహుల్ గ్రూప్.. రెండోది ప్రియాంక గ్రూప్. రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది’ అని దుయ్యబట్టారు.