calender_icon.png 21 May, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాన్లపై ఉగ్రవాదుల దాడి

05-05-2024 12:05:00 AM

జమ్మూ కశ్మీర్‌లోని సురాన్‌కోట్‌లో ఘటన

శ్రీనగర్, మే 4: ఎయిర్‌ఫోర్స్ సైనికులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక జవాన్ మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సురాన్‌కోట్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఉగ్రవాదులపై తిరిగి దాడి చేశాయి. ఇరు వర్గాల మధ్య భీకర పోరుసాగింది. దీంతో ఉగ్రవాదులు పారిపోయారు. ఆ తర్వాత స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన బలగాలు ఆ ప్రాంతమంతా ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టాయి. కాగా, ఈ ఏడాది భద్రతాల బలగాలపై ఉగ్రవాదులు జరిపిన పెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు.