calender_icon.png 8 September, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం

08-09-2025 12:26:19 AM

  1. నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలి

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

కాగజ్‌నగర్, సెప్టెంబర్ ౭(విజయక్రాంతి ): హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఒక కంపెనీలో పట్టుబడడం దారుణమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. తెలంగాణ పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, తెలంగాణ హోంమంత్రి నైతిక బాధ్య త వహించి రాజీనామా చేయాలన్నారు.

గతం లో గుజరాత్‌లో అదానీకి సంబంధిచిన పోర్టు లో రూ.21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. మెఫడ్రిన్, ఎఫడ్రిన్ వంటి డ్రగ్స్ హైద రాబాద్ లో దొరకడం ఆందోళన కరంగా ఉం ది. కానీ దురదృష్టకరం ఏందంటే, డ్రగ్స్ ముఠాను దొరకబట్టింది మహారాష్ట్ర  పోలీసులన్నారు. ఒక నెలరోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు  పహారా కాసి, అన్ని ఆధారాలతో దాడులు చేసి డ్రగ్స్ దొరకబట్టారన్నారు.

డ్రగ్స్ తయారు చేస్తున్న నేరస్థులు 4 నెలలుగా ఒక ఫార్మా కంపెనీ పెట్టి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. ఓలేటి శ్రీనివాస్ విజయ్, పండరీనాథ్, జలెందర్ రెడ్డి అనే వ్యక్తులు దందా చేస్తున్నట్లు గా పోలీసులు గుర్తించారని తెలిపారు. డ్రగ్స్ అంతర్జాతీయంగా సరఫరా జరుగుతుందని మహారాష్ట్ర పోలీసులు చెబుతుంటే,తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. 

ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న హోం శాఖ విఫలమైందని విమర్శించారు. మహీం ద్రా యూనివర్సిటీ లో రేవ్ పార్టీలు జరిగితే  ఏం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ మొక్క ఎక్కడున్నా గద్ద లాగా పీకేస్తాం.. అందుకోసం ఈగల్ అనే కొత్త డిపార్ట్ మెంట్ ప్రారంభించామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ చర్లపల్లి లో డ్రగ్స్ ఎందుకు పట్టుకోలేదన్నారు. రైతుల తరపున ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. 

నల్లబాలు అనే సోషల్ మీడియా ఆక్టివైస్ట్‌ను భోజనం చేస్తుంటే ఎత్తుకెళ్లి అరెస్ట్ చేశారు, డ్రగ్స్ ముఠాను ఎందుకు పట్టుకోలేద న్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు,లా అండ్ ఆర్డ ర్ పోలీసులు, నార్కొటిక్స్ పోలీసులు, ఈగల్ టీం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. యూరి య బ్లాక్ మార్కెట్ కుంభకోణం,కోడిగుడ్ల కుంభకోణంపై మాట్లాడితే అరెస్టులు చేసే పనిలో పోలీసులు ఉన్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో 22% నేరాలు పెరిగాయని నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.