02-01-2026 01:22:57 AM
ఆలేరు, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సరం సందర్భంగా ఆలేరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బిర్ల ఐలయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మా నించినారు, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఆలేరు ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను,
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అఖిలపక్ష నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, బిజిన భాస్కర్, దూడల రాజు గౌడ్ పాల్గొన్నారు.