02-01-2026 01:21:56 AM
కొండగట్టుకు కేటాయింపులు సంతోషం
ఆలయ పూర్తి చేయండి
టీటీడీని కోరుతున్న భక్తులు
కరింనగర్, జనవరి1(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో కరీంనగర్ లో నిర్మించ తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం రెండేళ్లు దాటినా అడుగు ముందుకు కదల లేదు. 31 మే 2023 నెలలో ఆలయ నిర్మాణానికి అ ప్పటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తోపా టు అప్పుడు మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు టీటీడీ వేద పండితుల మధ్య వైభవంగా భూమి పూజ నిర్వహించామని, అయితే ఆ తర్వాత ఆలయ పనులు ముందుకు సాగలేదు. టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్లో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని అప్పటి అధికారులు హామీ ఇచ్చా రు, అందుకు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించారు, ఇక్కడ శ్రీవారి ఆలయాన్ని నిర్మించినట్లయితే అనేక జిల్లాల భక్తులకు కొంగుబంగారంగా మారే అవకాశం ఉంటుందని భావించారు కానీ ఆంధ్రాలో ప్ర భుత్వం మారింది కానీ పనులు ప్రారంభంకాలేదు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముక్షమంత్రి పవ న్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు అం జన్న దేవాలయంకు 35 కోట్ల రూపాయలు కేటాయించడమే కాదు ఈ నెల 3న కొండగట్టు లో భూమి పూజ చేయనున్న నేపధ్యం లో భక్తులు కరింనగర్ లో ఆగిపోయిన పనులపై ప్రశ్నిస్తున్నారు.కరీంనగర్ జిల్లాలోని పద్మానగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్ప టి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మే 31, 2023న శంకుస్థాపన చేశారు.ఈ ఆలయ నిర్మాణానికి అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే టీటీడీ నిర్మాణం చేస్తుందని సు బ్బారెడ్డి కార్యక్రమంలో స్పష్టం చేశారు. టీటీడీ రూ.20కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో రూ.20కోట్లు దా తల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
తిరుపతిలో నిర్వ హించే స్వామివారి కైంకర్యాలు ఈ ఆలయంలోనూ నిర్వహిస్తామని చెప్పారు. శ్రీనివాస పద్మావతి ఆలయాల మాదిరిగానే పద్మానగర్‌లో ఆలయ నిర్మాణం చేస్తామని తెలిపారు. సాయం చేయడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ దేవాలయాన్ని రెండు సంవత్సరాల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తారని హామీ ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి కరీంనగర్ ఆలయ పనులు ఆటకెక్కాయి. మాజి ఎం పి వినోద్ , మాజీ మంత్రి గంగుల కమలాకర్ లు ఇటీవల టి టి డి ఛైర్మన్ నాయు డు హైదరాబాద్ కు వచ్చినప్పుడు నిర్మా ణాం పనులు చేపట్టాలని కోరగా ఆయన సా నుకులంగా స్పందించారు.పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్న సందర్బంగా మరో మారు కోరుతున్నారు.