06-05-2025 12:22:13 AM
నాగర్ కర్నూల్ మే 5 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఓ కాం గ్రెస్ నేత దౌర్జన్యం శృతి మించింది. తమ దాయాది కుటుంబానికి వాటా ఇవ్వాల్సి వస్తుందనే అక్కసు తో తన అన్న భార్య వల్ల పు రెడ్డి పుణ్యవతి అనే మహిళను నడిరోడ్డు పై గ్రామస్తులంతా చూస్తుండగానే తలపై బండరాళ్లతో మోదీ చావబాదాడు.
తనను ప్రశ్నించిన వారిని సైతం దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించడంతో గ్రామస్తులంతా ప్రేక్షక పాత్రలోనే నిమగ్నమయ్యారు. ఈ విషాదకర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స అనంతరం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో తప్పని పరిస్థితుల్లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే మంతటి గ్రామానికి చెందిన నా గిరెడ్డి, పాపిరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు కాగా వీరికి మంతటి, దేశిటిక్యాల గ్రామ శివారులో 30 ఎకరాల భూమి, ఇల్లు తదితర ఆ స్తులు ఉన్నాయి. కాగా పాపిరెడ్డి అనే వ్యక్తి రాజకీయ పలుకుబడితో గత బిఆర్‌ఎస్ ప్ర భుత్వ హయాంలో తన అన్న నాగిరెడ్డికి స మాన వాటా పంచి ఇవ్వాల్సింది కాగా తానొక్కడే 30 ఎకరాల భూమి ఇల్లు ఇతర ఆస్తుల ను తల్లిని బెదిరించి రాయించుకున్నట్లు బాధిత నాగిరెడ్డి భార్య పుణ్యవతి ఆరోపించా రు.
గత కొంతకాలంగా ఇదే విషయంపై పో రాడుతున్నట్లు కోర్టు కేసు నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో నూతన శివాలయం ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో స్వగ్రామా నికి వచ్చింది. దీంతో శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో గ్రామస్తు లు అంత చూస్తుండగానే ఈ ఊరికి ఎందు కు వచ్చావు అంటూ బండరాళ్లతో తలపై మోదీ చావబాదాడు. స్పృహ తప్పి పడిపోయిన మహిళను స్థానికులు నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అదే రోజు రాత్రి బాధితురాలు బంధు వులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు స్వీకరించలేదని ఆరోపించింది. సోమవారం స్పృహలోకి వచ్చిన ఆమె న్యా యం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించగా తప్పని పరిస్థితుల్లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన పాపిరెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యక్తినంటూ చెలామణి అవుతూ గత కొద్దిరోజుల క్రితం పటంలోని ఓ మహి ళ ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి కి పాల్పడినట్లు కూడా సదరు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు సదరు కాంగ్రెస్ నేత పాపిరెడ్డికి చివా ట్లు పెట్టినట్టు తెలిసింది.