calender_icon.png 12 July, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహేంది వేడుకలు

12-07-2025 12:39:30 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణ పద్మశాలి మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గోరింటాకు వేడుకలను నిర్వహిస్తున్నట్లు మహిళలు తెలిపారు. ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి మహిళ సేవా సంఘం అధ్యక్షురాలు జంజరాల పుష్పలత, కార్యదర్శి చెన్నూరు సునీత, గౌరవాధ్యక్షురాలు వనమాల జయ, కోశాధికారి అనుమాండ్ల క్రాంతి కుమారి, ప్రచార కార్యదర్శి గుజ్జ రేవతి, ఇరుకుల్ల పుష్పలత, అనుమాండ్ల సుజాత, లహరి, రోషిని, శోభా, రక్షిత, ఉమా, రజిని, రమ, అనసూర్య, విజయ, తదితరులు పాల్గొన్నారు.