08-11-2025 07:35:50 PM
అలంపూర్: మానవపాడు మండల కేంద్రంలోని కలుకుంట్ల గ్రామంలో రైతు వేదిక వద్ద శనివారం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డప్ప,పిఎసిఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సీఈవో శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ... మార్క్ ఫెడ్ సహకారంతో ప్రభుత్వం కనీస మద్దతు రూ.2,400 కల్పిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఎకరాకు18.50 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నను కొనుగోలు చేస్తుందన్నారు. కాబట్టి రైతులు బ్యాంక్ అకౌంట్ ,ఆధార్ కార్డు పొలం పాస్ బుక్కు ,ఏఈఓ ధృవీకరణ పత్రం తీసుకొని కొనుగోలు కేంద్రానికి రావాలని రైతులకు సూచించారు.అలాగే మొక్కజొన్న 14 తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు గౌడ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నాగేష్, ఏఈఓ రాజమోహన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.