19-07-2025 12:32:14 AM
మాజీ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శంకర్ నగర్ లో సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి తో కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు అంజిరెడ్డి మాట్లాడుతూ 26వ డివిజన్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని, ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు విషయంలో అలాగే డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని , త్వరగా పూర్తి చేస్తానని తెలిపారు.