19-07-2025 12:31:23 AM
మేడ్చల్, జూలై 18(విజయ క్రాంతి): ఆరు నెలల కోసారి జరిగే దిశ సమావేశం మొక్కుబడిగా సాగింది. శుక్రవారం మేడ్చల్ కలెక్టరే ట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్త పాల్గొన్నారు.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సం క్షేమ పథకాల అమలుపై చర్చ జరగాలి. 68 ఎజెండా అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, కొన్నింటిపైనే చర్చ జరిగింది. అది కూడా తూతూ మంత్రంగా చర్చ జరిపారు. ఏ పథ కం అమలు తీరు ఎలా ఉంది? ప్రజలు లబ్ధి పొందుతున్నారా? అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలు ప్రస్తావనకు రాలేదు.
వ్యవసాయం మీద అసలు చర్చనే జరగలేదు. రైతులకు రుణమాఫీ జరగడం లేదు, ధాన్యానికి బోనస్ చెల్లించడం లేదు, వీటి ప్రస్తావన రాలేదు. పౌరసరఫరాలపై చర్చ అర్ధాంతరంగా ముగిసింది. గ్యాస్ సబ్సిడీ రావడం లేదు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ విపక్ష పార్టీలకే చెందినవారు అయినందున రాష్ట్ర ప్రభుత్వ పథకంలో డొల్లతనాన్ని ప్రస్తావించాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో నీటి సమ స్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి చర్చ జరగలేదు. గ్రామీణ నీటిపారుదల ఎస్ ఈ అట వీ అడ్డంకులను వివరించారు. దీనికి సంబంధించి పరిష్కారం గురించి చర్చ జరిగితే బా గుండేది. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎ ప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరెంటు గురించి అసలు చర్చనే జ రగలేదు.
జిల్లాలో కల్తీ కల్లు తాగి పదిమంది మరణించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ అంశం వచ్చినప్పుడు సంబంధిత అధికారులను విలువగా ఎవరూ రాలేదు. సమీక్ష సమావేశం ఉద్దేశం పక్కదా రి పట్టింది. అర్బన్ జిల్లాగా మారినప్పటికీ గ్రామీణ అభివృద్ధి పథకాల గురించి చర్చ జరిపి ఎక్కువ సమయాన్ని వృధా చేశారు. దిశా సమావేశం మళ్లీ ఇంతట్లో జరిగే అవకాశం లేదు.
మూడు గంటల్లో సమావేశం ముగింపు
ఆరు నెలలకోసారి జరిగే సమావేశంలో 68 అంశాలపై సుదీర్ఘంగా చర్చించాల్సింది పోయి కేవలం మూడు గంటల్లోనే మమ అనిపించారు. సమావేశానికి ముగ్గురు ఎ మ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. వివేక్ గౌడ్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి) హాజరు కాలేదు. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసినందున ఈసారి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా లేరు.
డబుల్ బెడ్ రూమ్ ల సముదాయాల వద్ద సౌకర్యాలు కల్పించాలి: ఈటల రాజేందర్, ఎంపీ
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ల సముదాయాల వద్ద సౌకర్యాలు కల్పించాలి. అంగ న్వాడి కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. బస్సు సౌకర్యం కల్పించాలి. లోకల్ కోటా, బయటి వారి కో టా నిర్ణయించాలి. జవహర్ నగర్, అల్వాల్లో డంపింగ్ యార్డ్ ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇతర ప్రాంతా ల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తరలించాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సై జ్ శాఖ ప్రమోషన్ శాఖగా మారింది. అధికారులు ఆదాయం పైన దృష్టి పెడుతున్నా రు కానీ ఇతర వాటిపై పెట్టడం లేదు. మం దు విచ్చలవిడిగా లభ్యమవుతుంది. అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారు.
ప్రోటోకాల్ పాటించడం లేదు: చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే
అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు. 18 నెలల నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి తనకు అధికారుల నుంచి ఆహ్వానం రాలేదు. ఓడిపోయిన వారికి, ము న్సిపల్ మాజీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్టీ నేషనల్ కంపెనీలు చాలా ఉన్నాయి. కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠశాలల ను దత్తత తీసుకునేలా చర్చలు జరపాలి.
డి సి కి నోటీసు ఇవ్వాలి: - మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే, మల్కాజిగిరి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజిగిరి డిసికి గత సమావేశంలో చెప్పినప్పటికీ ఈ సమావేశానికి కూడా రాలే దు. నోటీసు పంపాలి. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్ పై చర్యలు తీసుకోవాలి. మ ల్కాజిగిరి కాలేజీలో మూడు గదులు ఆక్రమించారు. ఇంటికి దగ్గర ఉంటుందని అక్క డే ఉంటున్నారు. కాలేజీలో అసలే గదుల కొరత ఉంది.
డిగ్రీ కాలేజీ, ఆస్పత్రులకు స్థలాలు కేటాయించాలి
ఉప్పల్ కు మూడేళ్ల కింద డిగ్రీ కళాశాల మంజూరు అయింది. కానీ ఇంతవరకు స్థ లం కేటాయించలేదు. వంద పడకల ఆసుప త్రి నిర్మాణానికి టెండర్ పిలిచారు. కానీ స్థలం కేటాయించలేదు. ఈ రెండింటికి వెం టనే స్థలాలు కేటాయించాలి.