calender_icon.png 19 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

19-07-2025 12:32:22 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

హుజూర్ నగర్,జూలై 18: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలలో చేరుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు...ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు నైపుణ్యత కలిగి పోటీ పరీక్షలకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని పరిశీలించి గుత్తేదారులను పనులు త్వరగా పూర్తి చేయాలని నాణ్యతలో రాజీపడకుండా ప్రతివారం పనుల పురోగతిపై నివేదిక అందించాలన్నారు.

బీహార్ నుండి వచ్చిన కూలీల చిన్న పిల్లలను చూసి చిన్న పిల్లలను పనుల వద్దకు తీసుకు రావద్దని,వారిని  అందుబాటులో ఉన్న అంగన్వాడి సెంటర్ లో చేర్పించాలని ఐసిడిఎస్ సిబ్బందిని  ఆదేశించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థుల క్లాసులోకి వెళ్లి సైన్స్ లో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు మీద క్లాసు తీసుకున్నారు.వనజ అనే విద్యార్థిని లేపి పారడే మొదటి సూత్రాన్ని చెప్పవలసిందిగా  కోరగా విద్యార్థిని  సమాధానం చెప్పడం వలన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

మోటివేషన్ పై క్లాస్ తీసుకొని  విద్యార్థులు కష్టపడి చదవాలని,ఏదో ఒక రంగంలో నైపుణ్యత సాధించాలని కష్టపడితే ఫలితం అదే వస్తుందన్నారు.ప్రతి ఒక్కరు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు సిద్ధపడి,ఉన్నత ఉద్యోగాలు సాధించాలని,తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మంచి స్థానాలలో  ఉండాలన్నారు.అంతకుముందు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

గర్భిణీ స్త్రీల డెలివరీ రేటును పెంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.హాస్పిటల్ లో వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి,తహసిల్దార్ నాగార్జునరెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ నక్క రవి కుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ గుంటుపల్లి శ్రీనివాస్, కెమిస్ట్రీ లెక్చరర్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మోడల్ కాలనీ పనులు వేగంగా పూర్తి చేయాలి

హుజూర్ నగర్,జూలై 18:  మోడల్ కాలనీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇండ్ల నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న హౌజింగ్ కాలనీని శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు...మోడల్ కాలనీలో పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేయాలనీ సూచించారు.

రోడ్లు,ఎలక్ట్రిసిటి,నీటి వసతి త్వరగా ఏర్పాటు చేయాలని అలాగే వర్షాకాలం కాబట్టి రోడ్లకి ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు,తహసీల్దార్ నాగార్జునరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, హౌజింగ్ డిఈ సిధార్థ, డిప్యూటీ ఈఈ జంగయ్య,ఏఈ సాయిరాం,వర్క్ ఇన్స్ పెక్టర్ అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.