24-07-2025 12:29:12 AM
- ఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో చేరిక
- బీఆర్‌ఎస్ కండువా తప్పిన కేటీఆర్
కాగజ్‌నగర్, జూలై 23 (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు గులా బీ గూటిలో చేరారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర నాయకులు డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మెంబర్, మాజీ సింగిల్ విండో చైర్మెన్ అర్షద్ హుస్సేన్, మాజీ కౌటాల ఎంపిపి బుసార్కర్ విశ్వనాథ్,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపిటిసిలు ,పలువురు గులాబీ కండువా కప్పుకున్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గం వస్తానని,బహిరంగ సభ నిర్వహించుకుందామని తెలిపారు.
డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడు తూ సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి కేవలం బిఆర్‌ఎస్ తోనే సాధ్యమన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గం నుండి ఈ చేరికలు ప్రాధాన్యం సంతర్చుకున్నాయి. కార్య క్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు,నక్క మనోహర్,నవీన్,,మండల కన్వీనర్లు ముస్తాఫిజ్, షాకిర్,బండు పటేల్ ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.