19-07-2025 12:12:55 AM
కడ్తాల, జులై 18 : మండలంలోని చరికొండ గ్రామంలో ఉన్న ఎంపీహెచ్‌ఎస్ పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థుల కొరత తీవ్రంగా వేధిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాలకూర్ల మహేందర్ గౌడ్, వెంకటయ్య,జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కాసాని కాటం లు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉండగా సబ్జెక్టుల వా రిగా గణితం,భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయ పోస్ట్లు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానంటూ వారికిహామీనిచ్చారు.