calender_icon.png 29 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంలో ధర్మం తప్పింది

29-12-2025 02:17:54 AM

అందుకే సమస్యలు, అశాంతి

ఆర్‌ఎస్‌ఎస్ సర సంఘచాలక్ మోహన్ భగవత్ 

కన్హా శాంతివనంలో ‘7వ విశ్వ సంఘ్ శిబిరం’ 

హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రంగారెడ్డి, డిసెంబర్ 28(విజయక్రాంతి): ప్రపంచంలో నెలకొన్న సమస్యలు, అశాంతికి ధర్మం తప్ప డమే ప్రధాన కారణం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మం డలంలోని కన్హా శాంతివనంలో విశ్వ నికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘7వ విశ్వ సంఘ్ శిబి రం’ ముగింపు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ.. ఏ కార్యమైనా తన నుంచే ప్రారంభం కావా లని భావించే వ్యక్తులను తయారు చేయడమే సంఘ్ లక్ష్యమన్నారు.

సమాజంలో మార్పు కోసం కేవలం చర్చలు సరిపోవని, నిస్వార్థమైన ఆచరణ అవసరమని పేర్కొన్నారు. రాజకీయం కోసం, స్వార్థం కోసం లేదా అహంకారంతో చేసేది సేవ కాదని.. ‘శివ భావే జీవ సేవ’ అన్న తత్వంతో ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేదే నిజమైన సేవా వ్రతమని స్పష్టం చేశారు. భారత్ తన సైనిక శక్తితోనో, ఆర్థిక బలంతోనో కాకుండా తన విశిష్టమైన జీవన విధానం ద్వారానే ప్రపంచానికి నేతృత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

విదేశాల్లో స్థిరపడిన స్వయంసేవకులు తమ మూలాలను మరువకుండా హిందూ ధర్మ సంరక్షణకు కట్టు బడి ఉండటం అభినందనీయమన్నారు. అక్కడి ప్రజ లు కూడా భారతీయ జీవన పద్ధతులపై ఆసక్తి చూపుతున్నారని, వారికి హిందూ స్వయంసేవక్ సంఘ్ ద్వారా శిక్షణ ఇచ్చే బాధ్యతను యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సమ్మేళనంలో అన్ని ఖండాలలోని 79 దేశాల నుండి 1,610 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సంఘ్ ప్రముఖులు, శిబిర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.