calender_icon.png 16 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి

15-05-2025 10:36:56 PM

ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్..

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): హత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా 18 మార్చ్ 2023 రోజున కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అకాల వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన దళితులు బిక్కునూరు లక్ష్మి, చిట్యాల రాజమణి ఇల్లు చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్(Government Advisor Mohammed Ali Shabbir) అన్నారు. ఇందిరమ్మ ఇల్లు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం, కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుంది. పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కాగానే జనవరిలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు.

కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఈరోజు వారి ఇంటి పనులు ప్రారంభిస్తున్నాము అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసాం. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరయ్యాయి. కామారెడ్డి నియోజకవర్గానికి 3028 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. త్వరలో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ రైతు భరోస అందజేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం.

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్  చెక్కులను సకాలంలో అందజేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఫామ్ హౌస్ లో పడుకొని ఇది చేయలేదు అది చేయలేదంటున్నారు. మీలా స్కాములు కమిషన్లు కబ్జాలు చేసి కుటుంబా అభివృద్ధి పార్టీ నాయకుల అభివృద్ధి కాకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మి రాజా గౌడ్, రామా గౌడ్, నర్సా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.