15-05-2025 10:31:23 PM
మెదక్ ఎంపీ రఘు నందన్ రావు..
గజ్వేల్: ఉన్నత చదువులు చదివితే సమాజంలో మంచి గుర్తింపు, హోదా దక్కుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రఘునందన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చదువుతోనే మహారాష్ట్రలోని మారుమూల గ్రామం నుండి గవాయ్ ప్రధాన న్యాయమూర్తి స్థానానికి ఎదిగారని రఘునందన్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... దేశంలో మత వ్యవస్థ తగ్గింది కానీ కుల వ్యవస్థ అలానే కొనగగుతుందన్నారు. రాముని దేవాలయానికి వెళ్ళే వారు అందరూ హిందువులే కానీ గ్రామంలో నేటికి మాదిగ వారి పల్లె మాల వారి పల్లె గానే పిలువబడుతుందంటూ మత, కుల తారతమ్యతను ఆయన తెలియజేశారు. ఎమ్మార్పీఎస్ అంటే మాదిగ హక్కుల కోసమే కాదని ఆరోగ్య శ్రీ, పెన్షన్ లు వాటి పథకాలు ఆవిష్కారం చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కులమతలకు సంబంధం లేకుండా అని వర్గాలకు అందేలా శ్రమించిన గొప్ప శక్తి అని కృష్ణ మాదిగ కొనియాడారు. కార్యక్రమంలో గాయకుడు ఏపూరి సోమన్న, స్థానిక ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు పాల్గొన్నారు.