27-01-2026 12:33:35 AM
ఐఏఎల్‌ఏ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 9 టెండర్ల నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఐఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎల్‌ఏ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమల పార్కుల్లో వార్షిక నిర్వహణ, భద్రతా సేవలు, విద్యుత్ మౌలిక వసతుల పనులకు మొత్తం 9 టెండర్లకు ఈ- నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ టెండర్లకు సంబంధించి బిడ్ డౌన్‌లోడ్ ప్రక్రియ జనవరి 22 సాయం త్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి 6మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు సమర్పించాల్సి ఉంటుందని టీజీఐఐసీ చీఫ్ ఇంజినీర్- నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జీడిమెట్ల, గాంధీనగర్, నాచారం, మౌలాలి, చర్లప ల్లి, మల్లాపూర్, ఉప్పల్, బాలానగర్ వంటి హై దరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లోని కీలక పారిశ్రామిక పార్కులు ఈపనుల్లో భాగం కానున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్, విద్యుత్ సరఫరా, భద్రతా వంటి మౌలిక వసతుల వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నా రు.
అనుకూల వాతావరణమే లక్ష్యం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మం డలం యాచారం సెక్షన్‌లో రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో, 33 కేవీ, 11 కేవీ విద్యు త్ లైన్లు, డీటీఆర్లు, ఎల్టీ లైన్లను రోడ్డు మధ్య నుం చి పక్కకు తరలించే కీలక పనులకు ప్రత్యేకంగా టెండర్ పిలిచారు. మేడ్చల్ జోన్‌లోని మల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో చేప ట్టనున్న నిర్వహణ పనులను ఎస్సీ/ఎస్టీ కాం ట్రాక్టర్లకు మాత్రమే కేటాయించడం ద్వారా సా మాజిక సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామిక పార్కుల వారీగా...
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల గాంధీనగర్ పారిశ్రామిక పార్క్‌లో వార్షిక మెయింటెనె న్స్ పనులకు గానూ రూ. 2.48 కోట్లు, మేడ్చల్ పరిధిలోని నాచారం పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ. 1.15 కోట్లు, మేడ్చల్ జోన్‌లోని మౌలాలి పారిశ్రామిక పా ర్కు పనులకు రూ. 42.86 లక్షలు, మేడ్చల్ పరిధిలోని జీడిమెట్ల పారి శ్రామిక పార్కులో రూ.39.45 కోట్లు, మేడ్చల్ పరిధిలోని బాలానగర్ పారిశ్రామిక పార్కులో రూ. 64.03 లక్షలు,
హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక పార్కులో రూ.1.09 కోట్లు, మేడ్చల్ జోన్‌లో మల్లాపూర్ పారిశ్రామిక పార్కులో రూ. 49.98 లక్షలు, మేడ్చల్ పరిధిలోని ఉప్పల్ పారిశ్రామిక పార్కులో రూ. 1.21 కోట్లు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్‌లోని మేడిపల్లిలో విద్యుత్ లైన్ తరలింపునకు రూ. 2.20 కోట్లుగా టెండర్ నోటిఫికేషన్ పేర్కొన్నారు.