calender_icon.png 14 May, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి

14-05-2025 01:09:57 AM

-  ప్రధాన అటవీ సంచాలకులు శ్రీమతి సువర్ణ 

- ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సునీతతో మంత్రి భేటీ 

- అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక 

- అటవీ సంపదను కాపాడుకోవాలని ఆదేశం 

భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (విజయ క్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ అ భివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు విశేష కృషి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి రూపురేఖల ను మారుచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ సంరక్షణ అభివృద్ధి గిరిజన హరిజన వర్గాల ఆదాయ వనరుల పెంపు దిశగా మంత్రి తు మ్మల ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే తీవ్రవాద ప్రభావితం ప్రాంతాల నిధు ల(ఎల్ డబ్ల్యు నిధులు) నుంచి కోట్లాది రూ పాయలతో రహదారుల అభివృద్ధి విస్తరణకు కృషి చేశారు.

మిగిలిన పనులను యు ద్ధ ప్రాతిపదికన చేపట్టేలా ఇప్పటికే అటవీ ప ర్యావరణ శాఖ మంత్రి  కొండా సురేఖతో పలుమార్లు భేటీ రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఎల్ డబ్ల్యూ ఈ పేజ్ 1,2,3,లలో కోట్లాది రూపాయల నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టారు. మిగిలిన పనులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే లేఖ రాశారు. ఇదే అంశంపై మంగళవారం ప్రధాన అటవీ సంచాలకులు శ్రీమతి సువర్ణ ,ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సునీత తో భేటీ అయ్యారు.

 ఫారెస్ట్ కు సంబంధించి ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చూడాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన సంపద ను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్య లు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని సూ చించారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టి అడవుల సంరక్షణకు నడుం బిగించాలన్నా రు. అడవుల సంరక్షణతోనే మానవజాతి మ నవడ సాధ్యమవుతుందని వెల్లడించారు.

గత 30 ,40 ఏళ్ల క్రితం అడవుల సంరక్షణ అభివృద్ధికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విశేష కృషి చేసిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో  ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాధాన్యత లేకుండా పోయిందని నూతనంగా వచ్చిన ప్రధాన అటవీ సంచాలకులు శ్రీమతి సువర్ణ ,ఎండి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా పూర్వవైభవం తీసుకు వచ్చేలా  కృషి చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్ రహదారులకు తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అలాగే పార్కుల అభివృద్ధి తదిత ర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఎల్ డబ్ల్యూఇ నూతన రహదారులు...

మంత్రి తుమ్మల ప్రత్యేకత తీవ్రవాద ప్ర భావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు కింద పలు రహదారుల అభివృద్ధి చేసేందుకు ని ధులు మంజూరు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఆరు రహదారులకు త క్షణమే అటవీ శాఖ అనుమతులు మంజూ రు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి  కోరారు.

వాటిలో కొత్తగూడెం జిల్లా పరిధిలో జూలూరుపాడు మండలంలో పడమ టి నర్సాపురం నుంచి అన్నారుపాడు, చుం చుపల్లి మండలంలో పాత అంజనాపురం నుంచి బేతంపూడి వరకు, జూలూరుపాడు సుజాతనగర్ మండలాల్లో కొమ్ముగూడెం నుంచి రాఘవపురం వరకు,  లక్ష్మీదేవి పల్లి మండలంలో హేమచంద్రపురం నుంచి జూ బ్లీ పురం గుట్ట, టేకులపల్లి మండలంలో వెం కటా తండా నుంచి కుంట్ల రోడ్డు వరకు, దు మ్ముగూడెం మండలంలో కొత్తపల్లి మెయిన్ రోడ్డు నుంచి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. 

పార్కుల అభివృద్ధికి కీలక ఆదేశాలు...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్ధి ఆధునికాంగులతో నూతన పార్కుల నిర్మాణానికి మంత్రి తుమ్మల విశేష కృషి చే స్తున్నారు. ప్రధానంగా ఖమ్మంలోని వెలుగుమట్ల పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలం లో కనిగిరి హిల్స్ ఎకో టూరిజం,  కొత్తగూడెంలో ఎకో పార్కు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు.

పర్యాటకులను ఆకర్షించేలా ఆ ధునిక హంగులతో అత్యాధునిక సౌకర్యాలతో పార్కుల నిర్మాణాన్ని శరవేగంగా చేప ట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. పా ర్కులను అభివృద్ధి చేస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారని పార్కుల అభివృద్ధితో ఈ ప్రాంత రూపురేఖలు మరింతగా మారుతాయన్నారు. అభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఆదాయ వనరులకు సైతం పెంపొందించాలి...

ఏజెన్సీ ప్రాంతంలో హరిజన గిరిజనులకు ఆదాయ మార్గాల పెంపు దిశగా ప్రధా న అటవీ సంచాలకులు శ్రీమతి సువర్ణ గారు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నా గేశ్వరరావు ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతం లో అడవుల సంరక్షణకు నడుం బిగించి, గిరిజనుల ఆదాయం పెంపొందించే మార్గాల ను అన్వేషించాలన్నారు.

పర్యాటక అభివృద్ధితో గిరిజనుల అభివృద్ధి చెందే అవకాశ ము ఉందన్నారు. పోడు భూములలో వెదు రు సాగు కు శ్రీకారం చుట్టాలన్నారు. తద్వా రా గిరిజనులకు ఆదాయ వనరులు పెం పొందుతాయన్నారు. వన సంరక్షణతో ప్రకృ తి ఫరీడవిల్లుతుందన్నారు. గిరిజన జీవితాల్లో వెలుగులు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు.