26-11-2025 12:00:00 AM
గతంలో నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో వారే అధ్యక్షులు
రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం
గిరిజనులకు పెద్దపీట
బీసీలను విస్మరించిన కాంగ్రెస్
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో భాగంగా పార్టీ విధివిధానాలు రూపొందించింది.డీసీసీల ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధిని కేటాయించడంతోపాటు ముగ్గు రు పిసిసి సభ్యులను కోఆర్డినేటర్లుగా నియమించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో ప్రతినిధు లు దాదాపు పది రోజులపాటు ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ తోపాటు ఆశవావుల వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించిన అనంతరం అధిష్టానానికి పలువురి పేర్లను నివేదిక రూపం లో అందజేశారు. నెలరోజుల పాటు కసరతి చేసిన కాం గ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త జిల్లా అధ్యక్షులను ప్రకటించిన నేపథ్యంలో సమీకరణాలు తారుమారాయి అయ్యాయని చర్చ జరుగుతుంది.
వెలుమకు వెనుకడుగు...
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ,నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలలో వెల మ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు కొక్కిరాల సుకన్య, శ్రీపతిరావు ,కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు ప్రతిపక్షంలో ను పార్టీని అంటబెట్టుకొని కార్యకర్తల కు అండగా నిలుస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతూ కంటికి రెప్పల కాపాడుకుంటూ వచ్చారన్న చర్చ జరుగుతుంది.పార్టీ అధిష్టానం పాతవారికి అవకాశం లేదని చెప్పడంతో పాటు ప్రత్యేకంగా డీసీసీ ఎంపికపై గైడ్ లైన్స్ రూ పొందించింది.
దీంతో వెలుమా సామాజిక వర్గంలో పాతవారికి కాకుండా అదే వర్గంలో ఒక్కరికైనా డీసీసీ వస్తుందని ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ఊహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రఘు నాథ్‌కు డీసీసీ అధ్యక్ష పదవిని ప్రకటించింది. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణ ,వేడ్మ బొజ్జు కు కేటాయించి అవర్గానికి పెద్దపీట వేయగా ఆదిలాబాద్ లంబాడ సామాజిక వర్గానికి చెందిన నరేష్ జాదవ్ కి కేటాయించారు.
బీసీ,ఎస్సీ ఊసే ఎత్తలేదు...
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎంపిక లో ఎస్టీ,ఓసి సామాజిక వర్గాలకు ప్రతినిత్యం వహించేందుకు అవకాశం కల్పించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో బీసీ ,ఎస్సీల కు మాత్రం మొండిచేయి మిగిలింది.ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా బిసి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో ఈ రెండు జిల్లాలలో బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న కొంతమంది నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్ష పదవుల కేటాయింపులను పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ, ఓసి సామాజిక వర్గాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులను కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టి ఎంపిక ప్రక్రియలను పూర్తి చేసింది. డీసీసీ పదవి కేటాయింపుల్లోనూ చాలామంది ఆశావాహులు పెద్ద ఎత్తున పైరవీలు చేశారని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కేటాయించినప్పటికీ వారు కూడా అధ్యక్ష పదవి కోసం పైరవీలు చేశారని పార్టీ వర్గాల్లో బహిరంగంగా చర్చ జరుగుతుంది.