05-10-2025 12:00:00 AM
రంగారెడ్డి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెం డా ఎగురేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, ఐటీ మం త్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో శనివారం మం త్రి శ్రీధర్ బాబు కీలక భేటి అయ్యారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి, ఇబ్రహీంపట్నం, పరిగి, కల్వకుర్తి, షాద్‌నగర్, తాండూరు ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కె.శంకరయ్య, బి. మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు కేఎల్‌ఆర్(మహేశ్వరం), భీం భరత్( చేవెళ్ల) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థా యిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలం, బలహీనతలు, గత ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్వయ లోపం రాకుం డా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి మండలంలో పోటీ చేసే ముగ్గురు జెడ్పీటీసీ అభ్యర్థుల పేర్ల ను ప్రతిపాదించి ఈనెల 5 వరకు వారి వివరాలతో నివేదించాలని ఆయన సూచిం చారు. అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల అభిప్రాయాలను పరిగణలోకి తీసు కుంటామని, అయితే.. తుది నిర్ణయం మా త్రం పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని మం త్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.