03-11-2025 08:44:54 PM
హన్మకొండ (విజయక్రాంతి): బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ హనుమకొండ తహసీల్దార్ కి బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్, ఇంటలేక్చువల్ ఫోరం, బీసీ జాక్ ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం బీసీ జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ చందా మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని, దాన్ని చట్టబద్ధం చేయడం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎంపీలతో పార్లమెంటులో బిల్లును పెట్టే విధంగా పోరాటం చేయాలని, ఈ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, బీసీ జాక్ కన్వీనర్ తిరునహరి శేషు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కే.వీరస్వామి, ఇంటలేక్చువల్ ఫోరం కో ఆర్డినేటర్ మండల పరశురాములు, తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గైనీ రవీందర్, బీసీ ఎస్సీ ఎస్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ మేకల సుమన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ బుర్ర దామోదర్ గౌడ్, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు గూగులోత్ రాజన్న నాయక్, నాగరాజ్, విక్రమ్, రాంబాబు, తిరుపతి, రవి,రాజు, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ నాయకులు పాల్గొన్నారు.