18-10-2025 07:36:08 PM
ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శనివారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్ లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షులు బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తాం అని రాహుల్ గాంధీ చెప్పారని ఆ మాట ప్రకారం ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరగాలని అసెంబ్లీలో బిల్లు పెట్టారని, అట్టి బిల్లు నెలలు గడుస్తున్నా గవర్నర్ దగ్గర ఆమోదంపొందలేదన్నారు.
బీసీలకు న్యాయం జరగాలని ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీలు బీసీ బిల్లు పై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పిసిసి పదవి బిసి బిడ్డ కు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో నగరికల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ చామల శ్రీనివాస్ , లింగాల వెంకన్న గాజుల సుకన్య, యాసరపు వెంకన్న, గాదగోని కొండయ్య, మంగినపల్లి రాజు , కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.