18-10-2025 07:37:26 PM
పాండవుల గుట్టలకు ప్రపంచ స్థాయి పర్యాటకులను తీసుకురావచ్చు
పురాతన కట్టడాలు పరిరక్షణకు కృషి
రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు కూతాడి అర్జునరావు
రేగొండ,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని రాష్ర్ట పురావస్తు శాఖ సంచాలకులు కూతాడి అర్జునరావు అన్నారు. మండలంలోని పాండవుల గుట్టలు, బగులోని గుట్టలు, మండల కేంద్రంలోని పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి సంచాలకులు అర్జునరావు సందర్శించారు. ఈ సందర్భంగా పాండవుల గుట్టలో ట్రెక్కింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ సహజ రాతి ఆకృతులు, పురాతన చిత్రాలు, ప్రకృతి పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.
పాండవుల గుట్టాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అభివృద్ది చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అన్నారు. మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నియోజక వర్గంలో కోటంచ, నాపాక, బుగులోని వేంకటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ది అద్భుతంగా జరుగుతుందని అభినందించారు. సందర్శించిన వారిలో ఉప సంచాలకులు నాగరాజు, సాయికిరణ్, కాంగ్రెస్ రేగొండ టౌన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తదితరులు అన్నారు.