calender_icon.png 27 January, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు

27-01-2026 12:21:28 AM

జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం

భీమదేవరపల్లి, జనవరి 26 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 42 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు సమ్మక్క సారక్క చైర్మన్ జక్కుల ఐలయ్య తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, చైర్మన్ జక్కుల ఐలయ్య లు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భక్తుల కొరకు మంచినీరు, విద్యుత్, భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతరకు హుజరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, హుస్నాబాద్ నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. 5 లక్షల మంది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆలయ డైరెక్టర్లు పెంట పూర్తి వీరారెడ్డి , గుడికందుల రాజు, పెంచికల జైపాల్, మాడుగుల యాదగిరి, కొదురుపాక శ్రీనివాస్ వంగ శ్రీనివాస్ , మారుపాటి వీరారెడ్డి, మార్పాటి శ్రీనివాస్ రెడ్డి, విజయ రెడ్డి, ఎలుక పెళ్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.