06-01-2026 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్
రాజేంద్రనగర్ జనవరి 5, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా భౌగోళిక ఉనికిని, రాజకీయ ప్రాముఖ్యతను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, ప్రభు త్వ చేపడుతున్న చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కలిసి జిల్లాలో నెలకొన్న ఆందోళన కర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అంజన్ కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ, గోశామహల్ జిల్లా ప్రభారి వై. శ్రీధర్, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారా గూడెం మల్లారెడ్డి , వనపర్తి జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొమరయ్య , రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ పోన్నముని మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.