05-05-2025 12:16:36 AM
ముషీరాబాద్, మే 4 (విజయక్రాంతి) : దేశంలో కొన్ని విచ్చిన్న కార శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలు చేస్తున్నాయని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నా రు. ఆదివారం ముషీరాబాద్ లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జై బాపూ, జై బీమ్, జై సమివిదాన్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అనిల్ కుమార్ యా దవ్ భారత రాజ్యాంగ పుస్తకాన్ని చేతపట్టి ర్యాలీలో ముందుకు సాగారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... బీజేపీ రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరో పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను కించపురుచుతూ మాట్లాడినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని, విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ కృషిచేస్తున్నదని అన్నారు.
ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ స్పూర్తి, బాపూజీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కులగణన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేపట్టాకే కేంద్రంలో కదలిక వచ్చిందని అం దువల్లే ప్రధాని మోదీ కులగణన నిర్ణ యం తీసుకున్నారన్నారు. కులగణన కార్యక్రమా న్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కమి టీ కార్యదర్శి డి.వెంకటేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తమగొండ రాజ్దీప్, జనిగే శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ నియోజకవర్గం బి-బ్లాక్ కమిటీ ఉపాధ్యక్షుడు పట్నం నాగ భూషణం గౌడ్, కార్యదర్శి రామకృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.
సన్నబియ్యం పంపిణీ
ముషీరాబాద్ లోని శివాలయం చౌరస్తా వద్ద గల రేషన్ షాపులో లబ్దిదారులకు ఎంపి అనిల్ కుమార్ యాదవ్ సన్నబియ్యం పంపిణీ చేశారు. రేషన్ కార్డు లబ్దిదారులతో సన్నబియ్యం ఎలా ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తున్నారని అన్నారు. పేదల సం క్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.