calender_icon.png 5 May, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ పరీక్ష కేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థి

05-05-2025 12:19:23 AM

సకాలంలో హెల్ప్ చేసిన పోలీసులు

మహేశ్వరం, మే 4: ఓ విద్యార్థిని ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం  5గంటల వరకు కాంచన్ బాగ్ డిపెన్స్ లబొరేటరీ పాఠశాల లో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా ఆ విద్యార్థి పొరపాటున ఆర్ సి ఐ లోని డిపెన్స్ లబొరేటరీ పాఠశాల కు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చేరుకుంది.

విషయం తెలుసుకుని విద్యార్థి ని ఆందోళన కు గురైనది. దింతో అక్కడే ఉన్న మహేశ్వరం అదనపు డిసిపి సత్యనారాయణ, ఏ సిపి లక్ష్మీ కాంత్ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గమనించి విద్యార్థి హాల్ టికెట్ పరిశీలించారు. వెంటనే పోలీసుల పెట్రోలింగ్ వాహనంలో విద్యార్థినిని ఎక్కించు కొని సకాలంలో కాంచన్ బాగ్ డిపెన్స్ లబొరేటరీ పాఠశాల కేంద్రానికి చేరుకున్నారు. దింతో పోలీసులు చూపిన చొరవకు నెటీజర్లు పోలీసులను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైరల్‌గా మారింది.