05-05-2025 12:13:25 AM
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బోథ్, మే 4 (విజయక్రాంతి): పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చే రైతుల పక్షాన అధికా-రులు నిలిచి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా మార్కెట్‌కు తొలి పంట ను తీసుకొచ్చిన రైతును శాలువతో సన్మానిం-చిన, తూకం కాంటలకు పూజలు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అధికారులు రైతుల తరఫున నిలవాలని రైతుల కు న్యాయం జరిగేలా చూడా-లని అన్నారు. ఎలాంటి సాకు చూపకుండా, రైతులు పం డించిన పంటను పూర్తి స్థాయిలో కొను-గోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యక-ర్తలు పాల్గొన్నారు.