calender_icon.png 10 May, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు పూర్తి

09-05-2025 08:17:37 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): అధికారిక లాంచనాలతో గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించారు. మావోయిస్ట్ లు పేల్చిన మందు పాతరలో గ్రే  హాండ్స్  కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ మృతి చెందిన విషయం  విధితమే. ఆయన అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ సెట్ కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశిష్ సంగు వన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.