23-07-2025 12:14:23 AM
ఇద్దరు నిందితులు అరెస్ట్
గద్వాల్ టౌన్ జూలై 22జోగులాంబ గ ద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం లో అయిజ మండల కేంద్రంలోని జయలక్ష్మి ఏజెన్సీ నందు ఈనెల 11 న 18 లక్షల విలువ గల సిగరెట్లు దొంగతనం అయ్యిందని అయి జ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అట్టి కేసును పోలీసులు చేదించారు.కేసుకు సం బంధించి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు.
సిగరెట్ల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 15 ల క్షల విలువ గల సిగరెట్లను 2మొబైల్ ఫోన్ల ను ఒక మారుతి ఈకో వ్యానును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.సిగరెట్ల దొంగతనం కేసులో ముగ్గురు దొంగతనానికి పాల్పడగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అం దులో ఒకరు పరారిలో ఉన్నట్టు తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు రివార్డులతో అభినందించారు.