calender_icon.png 23 July, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే ఎవరితోనూ రిలేషన్‌లో లేను

23-07-2025 12:15:14 AM

విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన తాజాచిత్రం ‘తలైవన్ తలైవి’. పాండియన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం జూలై 25న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లో నిత్యామీనన్.. ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. “కాలం గడిచేకొద్దీ ప్రేమపై నా అభిప్రాయం మారుతూ వచ్చింది.

అది నా జీవితానికి కేంద్ర బిందువు కాదు. నా సోల్‌మేట్‌ను కనుగొనడం చాలా ముఖ్యం అని నాకు చిన్నప్పుడు అనిపించేది. కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం కూడా అది అనివార్యం అని నమ్మేలా చేస్తారు. కానీ, వేరే జీవితం కూడా ఉందని నేను అర్థం చేసుకున్నాను. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. అలా ప్రేమ, పెళ్లి అందరికీ అసాధ్యం. ఒకవేళ అది జరిగితే మంచిది.. జరగకపోయినా మంచిదే. ఆ విషయం నన్ను బాధపెట్టదు. ఇప్పుడు నా జీవితం ఓపెన్ పాత్. అందుకే చాలా సంతోషం గా ఉన్నాను.

స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం దొరికింది. ఇలాంటి జీవితంలో ప్రతిదీ గొప్పగానూ, అద్భుతంగానూ ఉం టుంది. నేను గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిసారీ హార్ట్ బ్రేకే మిగిలేది. ఆ బంధాలు మనుషుల ఉద్దేశాలను నేర్పుతాయి. మీరు వెతుకుతున్నదే తప్పు అని గ్రహిస్తారు. అప్పుడు దాన్ని వదిలేయాలి. అందుకే నేను ఇప్పుడు ఎవరితోనూ లేను” అని తెలిపింది.