calender_icon.png 23 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిలోమీటర్ పొడవునా నరికేశారు..

23-07-2025 12:17:01 AM

  1. మెయిన్ రోడ్డు ప్రక్కన నరికిన చెట్లు

రూ లక్షలాది ఖర్చుపెట్టి నాటి, పెంచి నరికిన పట్టించుకోవట్లే

అంచనాలు వేశాం జరిమానా విధిస్తాం : కే శ్రీనివాస్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దేవరకద్ర

చిన్న చింతకుంట, జూలై 22: పచ్చని చెట్లు-ప్రగతి మెట్లు అని ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఏటా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచుతోంది. అధికార పార్టీ చెందిన పెద్ద మనిషి పొ లం దగ్గర బిజినెస్ పర్పస్ గా అమ్మ పూర్ నుండి అల్లిపూర్ వెళ్లే దారిలో దాదాపు 1 కిలోమీటర్ పొడవు రోడ్డు పక్కల ఉన్న చెట్లను ఎక్స్కవేటర్లతో తొలగించారు.

విద్యుత్ నిమిత్తం విద్యుత్తు స్తం భాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించాలంటే పూర్తిస్థాయిలో అంచనాలు వేసి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా ప్రభుత్వమే కదా.. మా అవసరమే కదా అనుకున్నారో ఏమో తెలియదు కానీ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసేందుకు అడ్డు అవుతాయని భావించి దాదాపుగా ఒక కిలోమీటర్ పొడవున చెట్లను తొలగించారు. 

-ఇదేం పని అంటున్న ప్రజలు...

ఇండ్ల ముందల ఉన్న చెట్లను తొలగించాలంటేనే సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని తొలగించాల్సి ఉంటుంది. అలాంటిది ప్రభుత్వం ప్రత్యేకంగా మొక్కలను నాటి వాటి రక్షణ నిమి త్తం ప్రత్యేక చర్యలు తీసుకొని వృక్షాలను తయారు చేసిన తర్వాత ఎవరికో ఒకరికి అవసరం ఉం దని ఇష్టనుసారంగా తొలగిస్తే ఎట్లా అని ప్రజలు బహిరంగ చర్చించుకుంటున్నారు.

ఈ చెట్లు వాహనదారులకు, బాటసారులకు నీడనిస్తున్నాయి. చెట్లు లేని చోట స్తంభాలను పెట్టొచ్చు కదా అని వాహనదారులు అంటున్నారు. గత ఐదు రోజుల విద్యుత్ కోసమని విద్యుత్ స్తంభాలు పా తుతూ అడ్డుగా ఉన్న వేప,తుమ్మ,టేకు అని తేడా లేకుండా ఎక్స్కవేటర్లతో ఏపుగా పెరిగిన చెట్లను తొలగించారు.

ఇది చూస్తూ ప్రజలు, వాహనదారులు విద్యుత్ శాఖ తీరుపై మండిపడుతున్నారు. రోడ్ల పక్కన, మొక్కలు నాటడం ఎందుకు? మళ్ళీ నరికేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొ క్కలు వృక్షాలైన సమయంలో కొట్టేస్తే మరి నాటడం ఎందుకంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చెట్లను తొలగించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

- రోడ్లపైనే నరికేస్తే ఆపేటోళ్లు లేరా...

దర్జాగా రోడ్ల పక్కన ఉన్న చెట్లని తొలగిస్తే ఆపే అటవీ సంరక్షణ శాఖ అధికారలు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దర్జాగా నరికిన తర్వాత ఇష్టం సారంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ లైన్లను గుంజుకున్న తర్వాత అధికారులు ఇప్పుడు స్పందించిన ఎలాంటి ఉపయోగ ఉంటుందని ప్రజలు అసహహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల పక్కన ఇలా ఉంటే అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలను ఎలా కాపాడతారని ప్రజల నుంచి పలు విమర్శలు ఎదురవుతున్నాయి. చెట్లను నరికి వేయకుండా కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు పే ర్కొంటున్నారు. 

- అంచనాలు వేసి... ఉన్నత అధికారులకు అందించాం : కే శ్రీనివాస్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దేవరకద్ర 

సీసీ కుంట మండలం పరిధిలో రోడ్డు పక్కన చెట్లను తొలగించారని మా దృష్టికి వచ్చింది. అమ్మ పూర్ నుంచి అల్లిపూర్ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించి విద్యుత్ లైన్ల ను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించడం జరిగింది. చెట్లను తొలగించిన వ్యక్తికి జరిమానా విధిస్తాం. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. 

- ముందే చెప్పడం జరిగింది..

చెట్లు ఉన్నాయని ముందుగానే చెప్పడం జరిగింది. 10% విద్యుత్ శాఖకు డిపాజిట్ చేసుకొని తనకి వర్క్ కింద ఇస్టిమేట్ ప్రకారం పనులు చేయడం జరిగింది. చెట్లను తొలగించకూడదు అనే విషయాన్ని కూడా ముందుగానే చెప్పాను. సమాధి అధికారుల సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. నిబంధనల మేరకు పనులు చేయడం జరిగింది. 

       సురేష్, విద్యుత్ శాఖ ఏఈ, సీ సీ కుంట మండలం, మహబూబ్ నగర్ జిల్లా